1 July, 2026 | 8:55 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మధిరలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం… రైతులకు గుడ్ న్యూస్!

14-04-2026 12:28 AM

కేంద్రాన్ని  ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ 

ఎర్రుపాలెం, ఏప్రియల్ 13 (విజయక్రాంతి): మధిర మెప్మా ఆధ్వర్యంలో  మార్కెట్ యార్డ్ నందు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాతతో కలిసి ప్రారంభించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు న్యాయం చేయాలని ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన తెలిపారు.

తెలంగాణలో రైతులకు సంబంధించిన తాజా వార్తల కోసం మా Vijayakranthi News హోమ్‌పేజీని సందర్శించండి


రైతుకి నష్టం కలిగించకూడదని రైతుని రాజు చేయాలని ఉద్దేశంతో రైతులకు మేలు కల్పించడం లక్ష్యంతో  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గార్ల చొరవతో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ కోనా ధని కుమార్ మున్సిపల్ కమిషనర్ సంపత్, 22వ వార్డు కౌన్సిలర్ నాగార్జున  కాంగ్రెస్ నాయకులు రామనాథం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.