ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన ఏనుగు మనోహర్ రెడ్డి
27-08-2026 12:41 PM
రుద్రంగి ఆగష్టు 27(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రనికి చెందిన మహ్మద్ సదుల్లా,హసీనా,రీమ్స,హసీనా గత నాలుగు రోజుల క్రితం కారు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాలను బిఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు.ఒకే ప్రమాదంలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి మనోధైర్యం కలిపించాలని ప్రార్థించారు.సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, కంటే రెడ్డి,గంగం మహేష్,దయ్యాల కమలాకర్, దయ్యాల నారాయణ,ఉప్పులుటి గణేష్, సింగారపు గంగారెడ్డి,కదాస్ లక్ష్మణ్,తర్రే గంగారెడ్డి, కోడిగంటి శ్యామ్,గంటేప్రశాంత్,రగుట్ల నరేష్, ఉన్నారు.






