20 April, 2026 | 8:14 PM

రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి – వ్యవసాయ అధికారి

20-04-2026 06:58 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండలంలోని రైతులు తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. మండలంలో మొత్తం 11,200 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 8,200 మంది మాత్రమే నమోదు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా సుమారు 3,100 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని, రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పీఎం కిసాన్, ఎరువుల సరఫరా తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎక్కువగా నమోదు చేయించుకోలేదని తెలిపారు. అలాంటి రైతులు తమకు సమీపంలోని మీసేవ కేంద్రాలు, సిఎస్‌సి సెంటర్లు లేదా వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. మిగిలిన రైతులందరూ ఆలస్యం చేయకుండా రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని మండల వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు.