విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి
25-04-2026 07:58 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తన వరి పంటకు నీరు అందడం లేదని తన మోటార్ ని మరికొద్ది దూరం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం లక్నారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేపుగంటి దుడుమయ్య (58) తన వరి పంట ఎండిపోతుందని కేఎల్ఐ కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో తన మోటార్ ని మరి కొద్ది దూరంv నీరు ఉన్నచోటికి ఏర్పాటు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు.






