27 May, 2026 | 2:13 PM

కుటుంబాన్ని మింగేసిన అప్పుల ఊబి... వనపర్తి జిల్లాలో త్రీవవిషాదం

27-05-2026 12:20 PM

భార్య, బిడ్డను హతమార్చి బావిలో తోసి... కన్న కొడుకు కాళ్ళు కట్టేసి బావిలో తోసి తాను ఆత్మహత్య 

వనపర్తి జిల్లా లో త్రీవ విషాదం 

వనపర్తి, (విజయక్రాంతి): అప్పుల బాధ తీరకపోవడంతో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య  చేసుకున్న ఘటన వనపర్తి(Wanaparthy) జిల్లాలోని ఖిల్లాఘనపురంలో బుధవారం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా అప్పుల బాధతో త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్న గంగుల నర్సింహాలు కుటుంబం సలికేలపురం శివారులోని మామిడి తోటలో ఈ దారుణానికి ఒడిగట్టారు. ముందు భార్య, ఇద్దరు పిల్లలను సంపులో పడేసిన నరసింహ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగుల నర్సిములు(40) ఆరు సంవత్సరాల క్రితం తన భార్య ఎల్లమ్మ (36), కుమారుడు సాయి నిహాల్ (15), కూతురు సాహితీ శ్రీ (13) తో వచ్చి ఖిల్లా గణపురం మండలంలో మామిడి తోటలను లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పలు కారణాల వల్ల 60 నుంచి 70 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు సమాచారం. కొన్ని అప్పులకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అప్పుల బాధలు ఎక్కువ కావడంతో నరసింహులు భార్య, కూతురును తాము నివాసం ఉంటున్న సలికెలాపూర్ తాము ఉంటున్న తోటలో భార్య, కూతురును హతమార్చి నీటి సంపులో వేశాడు.

పారిపోయే ప్రయత్నం చేసిన కొడుకు కాళ్లు చేతులు కట్టివేసి సంపులో వేశాడు. అనంతరం బుధవారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో తన బావమరిది వెంకటేష్ కు ఫోన్ చేసి అప్పుల బాధ భరించలేక పోతున్నాం.. మీ అక్క, కోడలు, అల్లుడిని చంపి వేశాను. నేను కూడా ఉరి వేసుకుంటున్నాను. అని తెలియజేసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బంధువులు, గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.