17-02-2026 01:21:38 AM
హైదరాబాద్‌లో తులం ధర 1,56,440
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧౬: అంతర్జాతీయ మార్కెట్ల స్థిరత్వం, అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుదల, చైనాలో బంగారం నిల్వల పెరుగుదల కారణంగా బంగారం ధరలు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఫిబ్రవరి ౧న రూ.1,60,580 పలికిన ౨౪ క్యారెట్స్ తులం బంగారం ధర.. సోమవారం (౧౬వ తేదీ) రూ.1,56,440 పలికింది. అలాగే వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి.
ఈ నెల ౧వ తేదీన 3,20,000 పలికిన కిలో వెండి, ప్రస్తుతం రూ.2,79,900 పలుకుతున్నది. గత నెలలో కిలో 4 లక్షల వరకు ఎగబాకిన ధర, క్రమంగా తగ్గుతూ వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై మదుపర్లు ఆశలు పెట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్థిరత్వం పెరిగినా కొద్దీ, బంగారం, వెండి ధరలు మరింత పతనమవుతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.