13 May, 2026 | 12:51 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

పేలుడులో 8 మంది మృతి.. పలు నగరాల్లో హైఅలర్ట్

10-11-2025 08:35 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. పలువురికి తీవ్రగాయలు అవ్వగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఎల్ఎన్‌జిపి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికారులు పలు నగరాల్లో హైఅలర్ట్ ను ప్రకటించారు. దీంతో ఢిల్లీతో సహ ముంబై, హైదరాబాద్ నగరాల్లో పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.

రద్దీగా ఉండే ఎర్రకోట మెట్రోస్టేషన్ ప్రాంతం జనంతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడంతో మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా, పేలుడుకి సంబంధించిన వీడియోలు పేలుడు తీవ్రతను చూపించాయి. వాహనంపై ఒక మృతదేహం పడి ఉండటం కనిపించగా.. మరో వీడియోలో రోడ్డుపై ఒక మృతదేహం పడి ఉండటం కనిపించింది. పేలుడు జరిగిన ప్రదేశం సమీపంలో శరీర భాగాలు చెల్లాచెదురుగా కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడుతో ఘటన స్థలంలో భయంకరమైన దృశ్యాలు నెలకొంది.