3 June, 2026 | 6:55 PM

ప్రైవేట్ పాఠశాలలో దోపిడి నియంత్రించాలి

03-06-2026 05:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంతో పాటు పరిసర మండలాలలో ఉన్న ప్రైవేటు పాఠశాలల నిర్వహణ పై నిఘా,నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డీఈఓ కు వినతి పత్రం సమర్పించారు. యూనిఫాం పాఠ్య, నోటు పుస్తకాలు, స్టేషనరీ విక్రయాల పేర అక్రమంగా అధిక ధరలు నిర్ణయించుకొని పోషకులను దోచుకుంటున్నారు. సమయపాలన, ఫీజుల నియంత్రణ, మౌలిక వసతులు ప్రైవేట్ విద్యాసంస్థలలో సరిగా కల్పించడం లేదని ఆరోపించారు. అనుమతి లేని పాఠశాలలను తక్షణమే మూయించాలని డిమాండ్ చేశారు.

నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు పరిసర బైంసా, ముధోల్, ఖానాపూర్ పట్టణాలలో మండల కేంద్రాలతో పాటు పరిసర గ్రామాలలో వందలాదిగా ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పడుతున్న సంబంధిత నియమ నిబంధనలు పాటించడం లేదన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొన్ని పాఠశాలలు సమయపాలన తమదే రాజ్యాంగ నిర్ణయించుకొని పాటించడం వలన విద్యార్థులపై మోయలేని భారం పడుతున్నదని పేర్కొన్నారు. ఈ పాఠశాలల సమయపాలన పై నియంత్రణ అయినట్లయితే రానున్న రోడ్లలో సదరు పాఠశాలలలో చదువుతున్న పిల్లలకు మానసిక రోగాలు ప్రబలి వారు అనారోగ్యంగా మారే అవకాశాలు లేకపోలేవని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే పలు పాఠశాలలకు సంబంధించిన ఆయా అనధికారిక వ్యవహారాలపై ఆధారాలతో సహా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. . ప్రభుత్వ పాఠశాలలలో కూడా ఉపాధ్యాయుల సిబ్బంది సమయపాలన పనితీరును జిల్లా విద్యాధికారి జిల్లా కలెక్టర్ అనునిత్యం పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు పట్టణంలోని కొన్ని పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు సిబ్బంది పాఠశాలల పాలన సమయంలోనే బయట సంచరిస్తుండడం కనిపిస్తుందని పేర్కొన్నారు.