19 March, 2026 | 1:04 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్‌లెంట్ భాషా హైస్కూల్ విద్యార్థిని

19-03-2026 12:21 AM

పినపాక మార్చి 18(విజయ క్రాంతి) : నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక  అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని,  ఆరవ తరగతికి సీటు సాధించారని ఎక్స్ లెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ తెలిపారు. సీటు సాధించినందుకు పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందిస్తూ సత్కరించారు.

ఈ సందర్భంగా ఎక్స్ లెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సాధారణ విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్షలలో సత్తా చాటేలా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఎక్సలెంట్ విద్యా సంస్థల డైరెక్టర్లు ఖాదర్ షరీఫ్, యాకూబ్ షరీఫ్, ముక్కు నరసారెడ్డి, బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ అంకం సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.