04-02-2026 12:30:26 AM
8 తులాల బంగారు గొలుసు స్వాధీనం
శేరిలింగంపల్లి, పిబ్రవరి 3 (విజయక్రాంతి): చందానగర్ పోలీసు స్టేషన్ పరిధి లో వరుసగా రెండు చైన్ స్నాచింగ్ లు జరగడం సంచలనం సృష్టించింది. ఈ కేసును 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు చందానగర్ పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి రామచంద్రాపురం డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, చందానగర్ డీఐ భాస్కర్, ఎస్ ఓటీ సీఐ రాజశేఖర్ తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్ ఎంఐజీ కాలనీలో గత శనివారం మధ్యాహ్నం వరుసగా ఇద్దరు వృద్ధు ల మెడలో నుండి బంగారు గొలుసును లాక్కెల్లాడు ఓ దుండగుడు.
రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే ఈ సంఘటనలు జరగడం ఆందోళన కలిగించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు ఎస్ ఓటీ పోలీసుల సహాయంతో కేసును చేధించారు. శనివారం మధ్యాహ్నం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓల్ ఎంఐజి రామాలయం సమీపం నుండి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలు మెడలో నుండి బైక్ పై వచ్చిన దుండగుడు 6 తులాల బంగారు గొలుసును లాక్కుని పోగా, పక్క కాలనీలోనే మరో వృద్ధురాలు మెడలోని రెండు తులాల బంగారు గొలుసును కూడా లాకెళ్లాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శేరిలింగంపల్లి గోపీనగర్‌కు చెందిన రాజేష్ (32) అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో వాటి నుండి బయటపడేందుకు దొంగతనం చేయాలని ప్రణాళిక రచించాడు. ఇందులో భాగంగా వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని గత శనివారం మధ్యా హ్నం ఇద్దరు వృద్ధుల మెడలో నుండి బంగారు గొలుసును లాకెళ్లాడు.
చందానగర్ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసుల సహా యంతో దర్యాప్తు చేపట్టారు. బీహెచ్ ఈఎల్ లో దొంగతనం చేసిన నిందితుడు కరీనంగర్ పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడు రాజేష్‌ను జగిత్యాలలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి చోరీకి గురైన 8 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.