2 March, 2026 | 5:04 PM

అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి

02-03-2026 01:45 PM

షాద్ నగర్ జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్ స్వాతి రెడ్డి 

అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా  వైద్య ఆరోగ్య శిబిరం 

షాద్‌నగర్,(విజయక్రాంతి): అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనీ, ప్రతి ఆరు మాసాలకు ఒకసారి వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని  షాద్ నగర్  న్యాయ సేవధికార సంస్థ చైర్మన్, జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్ స్వాతి రెడ్డి సూచించారు.  సోమవారం షాద్ నగర్ కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నర్వ వేణుగోపాలరావు, గుండుబావి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్ స్వాతి రెడ్డి వైద్య ఆరోగ్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అనంతరం ఆమె కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని ప్రతి ఆరు మాసాలకు ఒకసారి తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. సుదీర్ఘ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని రోజువారీగా వ్యాయామం చేయాలని సూచనలు చేశారు. బార్ అసోసియేషన్ తరపున అపోలో హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయవాదుల కోసం వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామం ఆమె అభిప్రాయపడ్డారు. ఇంకా ఈ శిబిరంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం సాహితి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తదితరులు శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  అపోలో ఆస్పత్రి ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ మిట్టల్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సిమ్రాన్, డాక్టర్ కిరణ్ బేడీ, డా. నిహారిక, కంటి వైద్యులు కృష్ణ , అమీన్ , సాయి కిరణ్,   తదితరులు పాల్గొన్నారు.