చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆకాష్
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా మంగ్రే ఆకాష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు అహ్మద్ వైస్ చైర్మన్ గాబాధ్యతలు చేపట్టాలి.మున్సిపల్ కమిషనర్ గజానంద్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి బాధ్యతలు స్వీకరించిన ఆకాష్, అహ్మద్ తో పాటు కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. మంచి పాలన అందించి ప్రజలు మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.బాధ్యతలు స్వీకరించిన ఆకాష్, అహ్మద్ కు పలువురు శాలువలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ర్లు చిలువేరు వెంకన్న,బాల కృష్ణ, నాగుబాబు , సలాం బిన్ హైమద్,దూడల లక్ష్మి, జెభా షేక్ తదితరులు పాల్గొన్నారు.




