16 March, 2026 | 10:39 AM

క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ పోరాడాలి

16-03-2026 01:06 AM

బొంతు శ్రీదేవి యాదవ్ పిలుపు

కుషాయిగూడ మార్చి 15 (విజయ క్రాంతి) ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కి ల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఐజీ కాలనీలో మహిళల కోసం ఉచిత క్యా న్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందస్తు పరీక్షలు కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె. సీతారాంరెడ్డి, ప్రభుగౌడ్, గోపాల్ యాదవ్, ప్రకాష్ రెడ్డి, భాను పాల్గొన్నారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.