30 August, 2026 | 7:33 PM

ఎల్‌ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

30-08-2026 07:03 PM

ఖానాపూర్ ( విజయక్రాంతి): పెంబి మండలం మండపల్లి గ్రామానికి చెందిన మర్రి అశన్న అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ను ఆశ్రయించారు. వెంటనే స్పందించి సీఎం సహాయనిధి నుంచి రూ.7.50 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఆదివారం ఎల్‌ఓసీ చెక్కును బాధిత కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. నిరుపేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే భరోసా కల్పించారు ఎవరికి ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డ సంప్రదించాలని సూచించారు.