17 June, 2026 | 12:39 PM

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే

17-06-2026 11:30 AM

తాండూరు, జూన్ 17,(విజయక్రాంతి): సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండి ఓటరు జాబితాలో తమ పేరు నమోదు అయ్యేలా చూసుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం  ఆర్డిఓ అనిత ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీ ప్రారంభించారు. తాండూర్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారసింగ్ నాయక్ తో కలిసి 2కె రన్  అవగాహన ర్యాలీ నిర్వహించారు .  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ఇంకా ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ , వైస్ చైర్మన్ రజాక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాతుల నాగరాజు , ప్రభాకర్ గౌడ్ , కరణం పురుషోత్తమరావు, రియాజ్, తాండూర్ తాసిల్దార్ తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు .