22 May, 2026 | 9:29 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

నేటికీ బీఆర్‌ఎస్‌కే ప్రజల మద్దతు

10-12-2025 01:45 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): నేటికీ ప్రజలు బిఆర్‌ఎస్ కే మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే  కోవలక్ష్మి అన్నారు. కెరామేరి మండలం గోయెగావ్, కొఠారి కామాలు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కోవలక్ష్మి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మా ట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆయన చేసిన అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ మద్దతుదారులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోములే అన్నారావు, సోనులే బాపు, నగోషా పాండు, గూర్నూలే నారాయణ, పర్ది వాసు, మోర్లే జ్ఞానేశ్వర్, సిడం భీమ్రావు, సిడం దేవ్షిండ్ దినేష్, జి. నిఖిల్, బాపూజీ, అతీఫ్ తదితరులు పాల్గొన్నారు.