చిరంజీవి చంపినా చావడు!
18-08-2026 12:17 AM
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘చిరంజీవి’. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో కుడివైపు గుండె ఉండే కలిగి ప్రాణాంతక వ్యాధి ఉన్నా హీరో చావు నుంచి అనేక సార్లు తప్పించుకుంటూ ఉంటాడు.
మరోవైపు స్పైడర్ మ్యాన్ గెటప్‌లో ఒక వ్యక్తి విలన్స్‌ను వేటాడుతుంటాడు. ‘వాడు చిరంజీవి చంపినా చావడు, చచ్చినా చావడు..’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటోందీ ట్రైలర్. ఈ చిత్రానికి డీవోపీ: రామకృష్ణ; సంగీతం: శేఖర్ చంద్ర; ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్.






