23 April, 2026 | 10:38 PM

ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటు

23-04-2026 12:00 AM

కేంద్ర ప్రభుత్వ కీలక అడుగు

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౨౨: దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్- 2025లో భాగంగా బుధవారం ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఓజీఏఐ) ఏర్పాటు చేసింది. ఈ నియంత్రణ సంస్థ సేవలు వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి.

అథారిటీకి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. హోం వ్యవహారాలు, ఆర్థిక సేవలు, సమాచార ప్రసారశాఖ, క్రీడలు, న్యాయ వ్యవహారాలశాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థ, యువత, సమాచార భద్రతపై ఎక్కువగా ఉన్నందున వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ వ్యవస్థను అథారిటీ ఏర్పాటు చేసింది.

ఈ సంస్థ ఇక నుంచి ఆన్‌లైన్ గేమ్స్, ఈ నియంత్రించనుంది. ఏ గేమ్ పబ్లిక్ నిబంధనలకు లోబడి ఉంది.. ఏది డబ్బు లావాదేవీలపై ఆధారపడి ఉంది.. అనే అంశాలను నిగ్గు తేల్చి, నిబంధనలకు విరుద్ధంగా వ్వయహరిస్తున్న గేమింగ్ సంస్థలపై చర్యలు తీసుకోనుంది. అలాగే, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం కూడా ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి రానుంది.