5 March, 2026 | 3:19 PM

అమ్మ జన్మనిస్తది..అడవి ఆక్సిజన్ ఇస్తది..

05-03-2026 12:00 AM

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

చేవెళ్ళ మార్చి 4(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ డివిజన్ చిల్కూర్ మొయినాబాద్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ ఆధ్వర్యంలో అడుగుదాం పర్యావరణానికి పెను ప్రమాదం అనేది శీర్షికపై  అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యల గూర్చి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ళ మున్సిపాలిటీలోని మల్కాపూర్ 13వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ... అడవి అమ్మ లాంటిదని తల్లి జన్మనిస్తే అడవి ఆక్సిజన్ ఇచ్చిందని దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తిండి లేకపోయిన కొంతకాలం బతుకు వచ్చు కానీ ఆక్సిజన్ లేకపోతే భూమిపై ఏ ప్రాణి బ్రతకలేదన్నరు. అడవులు పెంచడం ఒక టాస్క్ అయితే ఉన్న వాటిని పరిరక్షించేందుకు  సమిష్టిగా కధం కలపాలన్నారు. కార్యక్రమంలో చిల్కూర్ హెడ్ మాస్టర్ లత సిబ్బంది పాల్గొన్నారు.