6 July, 2026 | 2:56 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

27-04-2026 09:03 PM

తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్

తుంగతుర్తి,(విజయక్రాంతి): మాదకద్రవ్యాలు గాంజా ఇలాంటి డ్రగ్స్ బారి నుండి మన పిల్లలను మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న ఐదవ అంశం పిల్లల భద్రత మాదకద్రవ్యాల నిర్మూలన సందర్భంగా జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు తుంగతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ కాలనీ నందు మాదకద్రవ్యాల నిర్మూలనపై తుంగతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్సై క్రాంతి మాట్లాడుతూ మాదకద్రవ్యాలను నిర్మూలించి వాటి భారీ నుండి మన పిల్లలను మన సమాజాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యత అని తెలియజేశారు. డ్రగ్స్ వినియోగించడం వల్ల యువత జీవితం నాశనం అవుతుందని అనారోగ్యాల పాలవుతారని జీవితం అర్దంతరంగా ముగుస్తుందని తెలియజేశారు. మాదకద్రవ్యాలను గంజాయి లాంటి డ్రగ్స్ ను నిర్మూలించాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసు వారికి అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.