పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
11-06-2026 12:16 AM
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల, జూన్ 10,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన వనమహో త్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులు, సిబ్బందితో కలిసి మొక్క లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పచ్చదనం తగ్గిపోవడం, కాలు ష్యం పెరగడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, కాలుష్య రహిత వాతావరణాన్ని అం దించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు రవి, మధుకర్, ఆర్‌ఐలు మధుకర్, సురేష్, రమేష్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






