పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఆర్డీఓ
అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 10: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వీధుల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇబ్ర హీంపట్నం ఆర్డీవో అనంత రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో లష్కర్ గూడ గ్రామంలో నిర్వహించిన ప్రణాళిక కార్యచరణ కార్యక్రమంలో పాల్గొని రోడ్లు, డ్రైనేజీ శుభ్రపరచడం వంటి పనులను పరిశీలించారు.
అలాగే ప్రాథమిక పాఠశాలలో మరు గుదొడ్లు సరిగా లేకపోవడంతో కొత్త మరుగుదొడ్లు నిర్మించే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాలువ పక్కన పారుతున్న డ్రైనేజీ కొరకు ఇంకుడుగుంత ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి మార్కింగ్ చేశారు.
అనంతరం ఆర్డీవో అనంతరెడ్డి మాట్లాడుతూ... గ్రామంలో ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీ వో శ్రీవాణి, తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి తుల్జా ప్రసాద్, ఈసీ సుధాకర్, సర్పంచ్ అల్లె ఐలయ్య, ఉప సర్పంచ్ కరిమల రాజు, పంచాయతీ కార్యదర్శి శివ ప్రసాద్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




