కాలువల్లో మురుగునీరు నిలువ ఉండకుండా చూడాలి
కలెక్టర్ ఆదేశం
తాండూరు, ఏప్రిల్ 24,(విజయక్రాంతి): కాల్వల్లో మురుగునీరు నిలువ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం ఆయన వికారాబాద్ జిల్లా పాత తాండూర్ ప్రాంతంలో డ్రైనేజి వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న కాలువల సమస్యలు, మురుగు నీటి నిల్వలు మరియు పారుదల లోపాలను గమనించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బందితో సమావేశమై ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.అనంతరం 581 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను పరిశీలించారు. సిసి రోడ్లు, త్రాగు నీరు, విద్యుత్, అన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్ డి ఓ అనిత, తహసీల్దార్ తారా సింగ్ తదితరులు ఉన్నారు.






