21 July, 2026 | 11:20 PM

Breaking News

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వరంగల్ చైర్మన్‌గా ఎన్నామినేని మనోజ్ రావు ఎన్నిక

10-04-2026 12:44 AM

వరంగల్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): వరంగల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( బీఏఐ) వరంగల్ చైర్మన్గా ప్రముఖ కాంట్రాక్టర్  ఎన్నామినేని మనోజ్ రావు ఎన్నికయ్యారు. ఇంతకుముందు ఆయన బీఏఐ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా సేవలందిస్తూ, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం, సంఘ బలోపేతం కోసం కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం, సేవలను గుర్తించి సభ్యులు ఆయనను చైర్మన్గా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మనోజ్ రావు ఉపాధ్యక్షులు వేముల సత్యమూర్తి, తన ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ  కృతజ్ఞతలు తెలియజేశారు. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో జన్మించిన ఆయనకు నిర్మాణ రంగంలో 22 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ విస్తృత అనుభవంతో ఆయన అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, రంగంలో విశ్వసనీయతను సంపాదించారు. మనోజ్ రావు కృషి, నాయకత్వం, సామాజిక బాధ్యతతో వరంగల్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు.ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు, సంఘ సభ్యులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.