4 March, 2026 | 11:35 PM

ఉపాధి హామీ డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

04-03-2026 09:41 PM

అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది

ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు కోరం చిరంజీవి

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సంవత్సరం కితం ప్రజలు ఉపాధి హామీ పనులను చేశారు సంవత్సరం గడుస్తున్న డబ్బులు రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కన్నాయిగూడెం మండలంలో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు కోరం చిరంజీవి అన్నారు ఆదివాసి గిరిజన సంఘ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు సర్వే చేయడం జరిగింది.

ఆ గ్రామాలలో గత సంవత్సరం నుంచి ఉపాధి హామీ పనికి పోయిన గాని ఇప్పటివరకు పైసలు రాక ప్రజలు అధికారులకు చెప్పిన గాని ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఉపాధి హామీ పని పైసలు చెల్లించలేదని వారు ఆవేదనవ్యక్తం చేశారు ఏపీఓ ఈ సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని అన్నారు ప్రభుత్వాధికారులకు నెలనెలకు జీతాలు ప్రభుత్వం ఇస్తది కానీ పేదలు పనిచేసుకుంటే వారి యొక్క కష్టారిజీతం వారి యొక్క శ్రమ ఎందుకివ్వటం లేదని మండిపడ్డారు