1 September, 2026 | 3:03 PM

గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి

01-09-2026 02:10 PM

సిర్పూర్ పేపర్ మిల్లులో 105వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

కాగజ్‌నగర్(విజయ క్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పేపర్ మిల్లు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 105వ రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా మొగిలి వెంకటేష్, ఏకే సింగ్ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. వారికి మద్దతుగా జేఏసీ కన్వీనర్ గోగర్ల రాములు, కో-కన్వీనర్ మహమ్మద్ షబ్బీర్, ఎం. విజయ్, అంగల శ్రీనివాస్, ముంజం ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించడం అత్యవసరమని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం, పేపర్ మిల్లు యాజమాన్యం ఇకనైనా స్పందించి వెంటనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.