సారీ మన్నించండి: ఎమ్మెల్యే భూక్యా మురళి
01-09-2026 02:40 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): నేను చెప్పిన సందర్భం ఉద్దేశ్యం వేరు.. యువత చెడుమార్గాలు పెట్టకూడదని, తల్లిదండ్రులకు భారం కాకూడదని, భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని సదుద్దేశంతో చెప్పే క్రమంలో ఆ..మాట దొర్లింది.. మాటల సందర్భంలో దొర్లింది కాబట్టి ఎవరి మనసుకైనా బాధ కలిగితే హృదయపూర్వకంగా నేను క్షమాపణ కోరుకున్నానని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి పేర్కొన్నారు. గుముడూరు అంశంలో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో క్షమాపణ చెప్పిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రెండు రోజులుగా తీవ్ర దుమారం చెలరేగింది.






