1 September, 2026 | 3:50 PM

క్రీడలు ఆరోగ్యం, ఉత్సాహం, ఉల్లాసానికి దోహదపడుతాయి

01-09-2026 03:01 PM

క్రీడలను ప్రారంభించిన జీఎం 

భూపాలపల్లిటౌన్,సెప్టెంబర్ 01 (విజయక్రాంతి): క్రీడలు ఉద్యోగుల ఆరోగ్యం, ఉత్సాహం, ఉల్లాసనికి దోహదపడుతాయని సింగరేణి భూపాలపల్లి ఏరియా(Singareni Bhupalpally Area) జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం భూపాలపల్లి ఏరియాలో 2026, 27 సంవత్సరానికి సంబంధించి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్(Work People Sports and Games Association) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాఖాపరమైన క్రీడా పోటీల్లో భాగంగా మంగళవారం కబడ్డీ పోటీలు పోటీలు స్థానిక క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభం కాగా జీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా స్టేడియంలోని అంబేద్కర్ విగ్రహానికి(Ambedkar statue) పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని జీఎం ఉత్సాహంగా కబడ్డీ ఆడి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు(Women employees) కూడా క్రీడా పోటీల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. మహిళా ఉద్యోగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో, క్రమశిక్షణతో పోటీలలో పాల్గొనాలని సూచించారు. క్రీడల ద్వారా ఉద్యోగులలో ఐక్యత, స్నేహభావం పెంపొందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఏజీఎం సివిల్ రవికుమార్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, గుర్తింపు సంఘం ఏఐటీయూసి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐ ఎన్ టీ యూ సి బ్రాంచ్ నాయకులు హుస్సేన్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ నజీర్, క్రీడల గౌరవ కార్యదర్శి సాయికృష్ణ, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, కో ఆర్డినేటర్ నాగేశ్వర్ రావు, ఇతర క్రీడకారులు పాల్గొన్నారు.