జగదాంబ అమ్మవారికి బంగారు బొట్టు
బంగారు బొట్టును సమర్పించిన రుద్రంగి గంగాధర్ దంపతులు
బాన్సువాడ, సెప్టెంబర్ 01 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Banswada) మండలం బుడిమి గ్రామంలోని జగదాంబ దేవి ఆలయం(Jagadamba Devi Temple)లో అమ్మవారికి బాన్సువాడకు చెందిన వ్యాపారవేత్త,జాగృతి హాస్పిటల్ యాజమాన్యం రుద్రంగి గంగాధర్ గుప్తా ఉదయ శ్రీ దంపతులు బంగారు బొట్టును భక్తిపూర్వకంగా సమర్పించారు. అనంతరం దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామంలో సుఖశాంతులు, సౌభాగ్యం, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బుడిమి గ్రామస్తులు డాక్టర్ తిరుమల గౌడ్, జిన్నా రాము, శ్రీనివాస్ గుప్తా తదితరులు ఉన్నారు.






