1 September, 2026 | 3:50 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

01-09-2026 02:58 PM

మఠంపల్లి సెప్టెంబర్ 01(విజయ క్రాంతి): రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రూ.14,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee reimbursement) బకాయిలను ప్రభుత్వం వెంటనే(immediately) విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మఠంపల్లి మండల ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కమిటీ సభ్యుడు జాల కిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు(Arrears) పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిల(Pending dues)ను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు ప్రభు,వెంకట్ రామ్ నాయక్, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు మల్లేష్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల నాయకులు పోతబత్తిని శ్రీనివాస్, కాంపాటి సందీప్, ఆరాల సైదులు, చందు తదితరులు పాల్గొన్నారు.