1 September, 2026 | 3:24 PM

మల్లికార్జున ఖర్గేసభాస్థలిని శుద్ధి చేసిన వారిపై చర్యలు తీసుకోండి

01-09-2026 02:34 PM

బోథ్.సెప్టెంబర్1(విజయక్రాంతి): మల్లికార్జున కార్గే(Mallikarjun) సభాస్థలిని గంగాజలంతో శుద్ధి చేసిన బిజెపి నాయకుల(BJP leaders)పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దళిత నాయకుని సభాస్థలి గంగాజలంతో శుద్ధి చేయడం కుల వివక్షను చూపించడమేనని ఫిర్యాదు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్(Dr. B.R. Ambedkar) ఆశలను దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా బిజెపి నాయకులు వ్యవహరించడం సరైంది కాదని పేర్కొన్నారు. శుద్ధిచేసిన నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, మండల పార్టీ కన్వీనర్ భోజన్న మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆశన్న, ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి మల్యాల అంజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జే భోజన్న,మునీశ్వర్ సోమన్న,వి శేఖర్‎లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాలసెమిందర్ రెడ్డి, వార్డు సభ్యులు గిరీష్ మహమ్మద్ కౌసర్,షేక్ అమిరుద్దీన్, ఫిరోజ్ ఖాన్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.