నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
01-08-2026 12:30 AM
అధ్యక్షురాలిగా డాక్టర్ స్వర్ణలత
పంజాగుట్ట, జూలై 31 (విజయక్రాంతి): నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ కు నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఏకగ్రీ వంగా ఎన్నికైంది. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలిగా డాక్టర్ స్వర్ణలత, ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ మేఘా ఉప్పిన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిఎస్‌ఎస్ గోపాల్, కోశాధికారిగా డాక్టర్ శ్రీనివాస్, సంయుక్త కార్యదరి ్శగా రామకృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భం గా వారు తమను ఎన్నుకున్న అధ్యాపకులందరికీ ధన్యవాదాలను తెలియజేశారు.






