1 September, 2026 | 5:35 PM

ప్రగతి శీల తల్లిదండ్రుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక

01-09-2026 04:46 PM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): ప్రగతి శీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కమిటీ(Progressive Parents Association State Committee) ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి మెడపట్ల మల్లేష్ అధ్యక్షతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షులుగా నిట్టూరి సారయ్య, అధికార ప్రతినిధిగా చాతరాసి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా భీమారపు సంధ్య, కోశాధికారిగా కొప్పుల రమేష్, ఉపాధ్యక్షులుగా లింగంపెల్లి తిరుపతి, జాడి గాయత్రి, మార్చెట్టి మహేష్, మీసాల శంకర్, సహాయ కార్యదర్శులుగా మగ్గిడి నరేష్, మారపాక మల్లేష్, జాడి రవి, కోట శంకర్, ప్రచార కార్యదర్శిలుగా బీ జగదీష్, నరావత్ రాజు, మీడియా ప్రతినిధులుగా వేల్పుల నగేష్, మంతెన సతీష్, కార్యవర్గ సభ్యులుగా దేవక్క, జుగునాక రాజేష్, రాంటెంకి లక్ష్మణ్, కొండేటి చంద్రశేఖర్, నైతం రమేష్, జోనల్ కమిటీ సభ్యులుగా మాసు సంతోష్, దొంత చంద్రయ్య, రావుల బాపు, ఇంఛార్జీ దుర్గం లింగయ్యలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రామాంజనేయులు, రాష్ట్ర నాయకులు మెట్ల శంకర్, రవికుమార్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.