1 September, 2026 | 5:35 PM

అక్రమ మట్టి మైనింగ్ మాఫియా ఆగడాలను అరికట్టండి

01-09-2026 05:01 PM

ప్రజల, మూగ జీవుల ప్రాణాలు కాపాడండి

ఎర్రుపాలెం మండల సిపిఎం కమిటీ డిమాండ్

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ప్రకృతి సంపదను యదేచ్ఛగా దోచుకుంటున్న మట్టి మైనింగ్ మాఫియాను(soil mining mafia) అరికట్టి మూగజీవుల, ప్రజల ప్రాణాలను కాపాడాలని మండల సిపిఎం కమిటీ(CPM committee) డిమాండ్ చేసింది. హద్దు అదుపు లేని ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఫారెస్ట్ భూములలో గుట్టలను పిండి చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతూ విచ్చలవిడిగా అక్రమ గ్రావెల్ తోలకాలను అరికట్టాలని, పశువులు జీవాలు మూగ ప్రాణులతోపాటు మనుషుల  ప్రాణాలను కూడా హరించి వేస్తున్న మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని తాహశీల్దారు కార్యాలయo నందు వినతి పత్రాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందించారు.

భట్టి ఇలాకాలో సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకుండా గాలికి వదిలి వేయటంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు(Deputy Chief Minister Bhatti Vikramarka) మట్టి మాఫియా చెడ్డపేరు తెస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం, అధికార పార్టీ అండదండలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తూ సదరు అక్రమార్కులు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకుండా ఉండటం వెనుక కారణమేంటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

గతంలో అక్రమ తవ్వకాల గురించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిరసనలు పాదయాత్రలు నిర్వహించి పలుమార్లు స్థానిక తహసిల్దార్, జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి చర్యలు చేపట్టకుండా వారికి సహకరిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులతో తనిఖీ చేయించి చర్యలు చేపట్టలని లేనియెడల సిపిఎం పార్టీ(CPM Party) ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి భవిష్యత్తు పోరాటాలకు కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘం జిల్లా నాయకులు గౌరాజు రాములు,దూదిగం బసవయ్య, షేక్ లాల్ సాహెబ్, కరీం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.