డాన్సర్ కుటుంబానికి జిల్లా నృత్య కళా సమాఖ్య చేయూత
01-09-2026 04:49 PM
మందమర్రి,(విజయక్రాంతి): రిథమ్ డ్యాన్స్ అకాడమీ(Dance Academy) డాన్సర్ గట్టు సాయికిరణ్ ఇటీవల మరణించగా వారి కుటుంబానికి మంచిర్యాల జిల్లా(Mancherial District) నృత్య కళా సమాఖ్య సభ్యులు రూ.11 వేల నగదుతో పాటు 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాకంసంతోష్, సభ్యులు సీనియర్ డ్యాన్స్ మాస్టర్ రామగిరి అర్జున్, అడ్డగురి లక్ష్మణ్, కొండపర్తి సది, వేల్పుల రమేష్, రమేష్ యాదవ్, ప్రశాంత్, సీనియర్ కళాకారుడు బబ్బర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






