15 June, 2026 | 3:28 PM

Breaking News

కిరాతకుడుని ఉరితీయాలి..   •   కేటీఆర్ ను కలిసిన పట్టణ అధ్యక్షులు   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు   •   శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •  

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

27-09-2025 11:29 PM

ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విధులు కేటాయించబడిన అధికారులు ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎంపీటీసీ/ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని తెలిపారు.

నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత నామినేషన్ పత్రాల స్వీకరణ నుండి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అధికారులు తమకు అప్పగించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు లోబడి విధులు నిర్వర్తించాలని, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అందించిన హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని, మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.