వృద్ధుడు ఆత్మహత్య
21-07-2026 01:30 AM
చౌటుప్పల్, జులై 20 : వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మండలంలోని చిన్న కొండూరు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చిన్న కొండూరు గ్రామానికి చెందిన నానంచర్ల పెంటయ్య( 72) ఇంట్లోనే మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో ఆరోగ్య సమస్య కారణంగా, జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని చనిపోయిట్లు తెలిపారు. అయితే అతని కొడుకు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






