18 April, 2026 | 10:29 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మారుమూల గ్రామాలకు రోడ్ల సౌకర్యానికి కృషి

29-11-2025 09:31 PM

ఎమ్మెల్యే పాయల్ ఆధ్వర్యంలో పలువురు బిజెపిలో చేరిక

ఆదిలాబాద్,(విజయక్రాంతి): అటవీ శాఖ అధికారుల ఇబ్బందులను తొలగించి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తిప్ప, అల్లికోరి, బోరజ్  మండలం రాంపూర్ గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్ తో పాటు పలువురు బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి పార్టీ ఆహ్వానించారు. 

   ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ప్రజలు ఆశీర్వదించి బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించిన విధంగానే రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.   అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ పంచాయితీలకు రూ. 25 లక్షలు అందజేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.