30 April, 2026 | 3:38 AM

కేసుల పరిష్కారానికి కోసం కృషి చేయాలి

30-04-2026 02:47 AM

జిల్లా న్యాయమూర్తి ఎ.వీరయ్య

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): జిల్లా న్యాయస్థాన సముదాయంలో కొనసాగుతున్న అండర్ ట్రయల్ కేసుల సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తి ఎ.వీరయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థాన సముదాయంలో గల కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జి- జిల్లా న్యాయ సేవ అధికారి వి. సంకేత్ మిత్ర, జిల్లా కలెక్టర్ కె. హరిత, జూనియర్ సివిల్ జడ్జ్ జె. అనంతలక్ష్మి, ప్రత్యేక సబ్ -జైల్ పర్యవేక్షకులు ప్రేమ్ కుమార్ లతో కలిసి కేసులకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అండర్ ట్రయల్ కేసులకు సంబంధించి కేసుల సత్వర పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అండర్ ట్రయల్ కేసులలో కక్షిదారుల పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. చార్జ్ షీట్ వేసిన/వేయని కేసులకు సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. బెయిల్ మంజూరు అయిన వెంటనే నిర్ణీత నిబంధనలను పాటిస్తూ సంబంధిత వ్యక్తులను విడుదల చేయాలని, అండర్ ట్రియల్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.