14 May, 2026 | 5:58 PM

మల్లాపూర్‌లో ఘనంగా విద్యావారోత్సవాలు

14-05-2026 04:45 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో భారతమాత కూడలి నుంచి విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పది శాతం విద్యార్థుల ఎన్‌రోల్మెంట్ పెంపుపై తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం, మంచినీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నివారణ, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం చంద్రమోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, ముష్కరి రమేష్, మహమ్మద్ షబ్బీర్, శనిగారపు నరేష్, ఉపాధ్యాయులు సుంచుల నర్సయ్య, ఏ. భాస్కర్, టి. సురేష్, డి. శివరాములు, జీ. సౌజన్య, ఈ. రాజశేఖర్, ఎం.డి. సాజీద్, సలీమోద్దీన్, యు. రమేష్, జీ. శ్రీనివాస్, టి. ప్రవీణ్ కుమార్, సీహెచ్ విక్రమ్, టి. దివ్య, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.