17 April, 2026 | 2:34 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

విద్యాభ్యాసం మనిషికి విలువ తెస్తుంది

15-04-2026 01:55 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనికేని దయానంద్ మున్సిపల్ కౌన్సిలర్ నిమ్మల రమేష్

ఖానాపూర్ (విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో మనిషి ఉన్నత స్థానానికి ఎదగాలంటే విద్యాభ్యాసం ప్రధాన అంశం. సామాజికంగా, ఆర్థికంగా ,ఆరోగ్యంగా ఉన్నత విలువలు కలిగి జీవించాలంటే మెరుగైన విద్యాభ్యాసం చాలా అవసరమని ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్ అన్నారు. బుధవారం ఖానాపూర్ లోని సీఎం రావు ఫంక్షన్ హాల్ లో జరిగిన నిస్సి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ నిమ్మల రమేష్ మాట్లాడుతూ ఎన్నో విలువలతో కూడిన విద్యాభ్యాసం అందిస్తున్న నిస్సి పబ్లిక్ స్కూల్ ని అభినందించాలని ,గత 23 ఏళ్లుగా ఇక్కడ చదువుకున్న వారు అనేక ఉన్నత స్థానాల్లో ,వివిధ  దేశాల్లో స్థిరపడ్డారని అన్నారు. పాఠశాల వ్యవస్థాపకురాలు విద్యాలత మాట్లాడుతూ విద్యార్థులను సమాజంలో వచ్చే సవాళ్లను మార్పులను దీటుగా ఎదుర్కొనే విధంగా విద్య బోధించి తయారు చేయడమే తమ విద్యా సంస్థ ప్రధాన లక్షం అని అన్నారు .ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్, కంటి వైద్య సహాయకులు చిత్రలత రెడ్డిమల్ల, కరస్పాండెంట్ ఉమాదేవి ,పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు.