6 May, 2026 | 9:07 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

మే 12న ఎడ్‌సెట్

24-02-2026 12:29 AM
  1. ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం
  2. రాష్ట్ర వ్యాప్తంగా 16 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): మే 12న ఎడ్‌సెట్ పరీక్షను నిర్వ హించనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈమేరకు సోమవారం ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వివరాలను ఆ యన వెల్లడించారు. సోమవారం నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఎడ్‌సెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులకు రూ.550, బీసీ, ఓసీలకు రూ. 750 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ఏప్రిల్ 22 నుంచి రూ.250 అదనపు రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి రూ.500 అదనపు రుసుముతో, ఏప్రిల్ 30 నుంచి రూ.వెయ్యి అదనపు రు సుముతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణలకు మే 2వ తేదీ వరకు అవకాశం కల్పించామని, మే 8,9 తేదీల్లో రూ.5 వేల అపరాధ రుసుం తో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మే 9న వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, మే 12న ఉ.10 నుంచి మ.12 వరకు, మ. 2 నుంచి సా.4 వరకు పరీక్ష జరగనుందన్నారు. మే 15న కీ విడుదల చేయ నున్నట్లు, సందేహాల నివృత్తికి మే 17 నుంచి వారంపాటు అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.