సీఎం డీకేకు ఆదిలోనే షాక్
- నీటిపారుదల శాఖ మంత్రి రామలింగారెడ్డి రాజీనామా
- బెంగళూరు అభివృద్ధి’ శాఖ ఇస్తా.. అని ఇష్టంలేనిది ఇచ్చారని అసంతృప్తి
- తీవ్ర అసహనంలో మరోమంత్రి కేహెచ్ మునియప్ప
- కర్ణాటక ప్రభుత్వంలో మళ్లీ అధికార పోరు : బీజేపీ
బెంగళూరు, జూన్ 5: కర్ణాటక ముఖ్యమం త్రి డీకే శివకుమార్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. మంత్రుల శాఖల కేటాయింపులో తీవ్ర అసంతృప్తి అలజడి సృష్టిస్తోంది. తనకు ఇష్టం లేని శాఖను కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి రామలింగారెడ్డి తన మంత్రిపదవికి శుక్రవారం రాజీ నామా చేశారు. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇవ్వాలని విన్నవించినా.. తనకు అవగాహన లేని, ఇష్టంలేని భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ ఇచ్చారని ఏకంగా మీడియా ముఖంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
మరో మంత్రి కేహెచ్ మునియప్ప కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో శాఖల కేటాయింపుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియారిటీకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ అధిష్ఠానం ఈ ప్రక్రియను పునఃపరిశీలించాలని కోరారు. సీనియర్ మంత్రి రామలింగారెడ్డి రాజీనామా ను ప్రకటించిన కొద్ది గంటలకే మునియప్ప ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గురువా రం రాత్రి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శాఖలను కేటాయించిన మరుసటి రోజే రామలిం గారెడ్డి రాజీనామా చేయడం, మునియప్ప త న అసహనం తెలుపడం గమనార్హం. అయితే ఈ పిరిణామాలపై సీఎం డీకే స్పందిస్తూ.. తాము మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని తెలిపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో, అటు కర్ణాటకలో రాజకీయం మళ్లీ వేడిక్కింది. డీకే శివకుమార్ ప్రభుత్వం ఏర్పాటై మూడు రోజుల్లోనే అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి.
జూన్ 3న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. 13 మందితో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. గురువారం రాత్రి మంత్రులకు శాఖలను కేటాయించారు. వారిలో రామలింగారెడ్డి ఒకరు. శాఖ కేటాయింపుల విషయంలో అసంతృప్తితో ఉన్న ఆయన మీడి యా ఎదుట తన రాజీనామా లేఖపై సంతకం చేశారు.
‘నా అంతరాత్మకు విరుద్ధంగా నేను పని చేయలేను కాబట్టి నా పదవికి రాజీనామా చేస్తున్నా’ అని ఆయన అన్నారు. ‘ఈ అవమానాన్ని నేను ఎంతకాలం భరించగలను? నా ముందున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి?‘ అని ఆయన ప్రశ్నించారు. తనకు బెంగళూరు అభివృద్ధి’ శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ దానికి బదులుగా నీటిపారుదల శాఖను కేటాయించారని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, ఎమ్మెల్యేగా ఉంటానని స్పష్టం చేశారు.
మూడురోజుల క్రితమే అధికారంలోకి వచ్చిన డీకే శివకుమార్ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ. అసంతృప్తితో ఉన్న మంత్రిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నాయకత్వం విలేకరుల సమావేశం జరుగుతుండగానే చివరి ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఏవైనా సూచనలను పరిగణనలోకి తీసుకునే సమయం అప్పటికే దాటిపోయిందన్నారు. అయితే రామలింగరెడ్డి రాజీనామాతో ఆయన మద్దతుదారుల నిరసన వ్యక్తం చేశారు.
వారు తమతమ పదవులకు ఒకేసారి రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్‌లో విభేదాలు మరింత పెరుగు తాయని, సీఎం మార్పు ఆ పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు చేశారు. డీకే ప్రభుత్వంలో అప్పుడే అంతర్గత కలహాలు చోటుచేసుకోవడంతో పాలన, అభివృద్ధిని దెబ్బతీస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు.
రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శివకుమార్ సీఎం కావచ్చు, కానీ ఇది సిద్ధరామయ్య మంత్రివర్గం. మొదటి వికెట్ పడిపోయిందని, అంతర్గతఅధికార పోరు మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్ కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో ఆ పార్టీకి వర్గ పోరు ఒక ప్రధాన లక్షణంగా మారిందన్నారు. కాంగ్రెస్ అలాంటిదేమీ లేదని చెప్తోంది.
మరో మంత్రి మునియప్ప అసంతృప్తి
కర్ణాటకలో మంత్రి రామలింగారెడ్డి రాజినామా తర్వాత, మరోమంత్రి కేహెచ్ మునియ ప్ప కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో శాఖల కేటాయింపులో ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియారిటీకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ నాయకత్వం ఈ ప్రక్రియను పునఃపరిశీలిం చాలని కోరారు. సామాజిక సంక్షేమ లేదా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయాలని మునియప్ప కోరుకున్నప్పటికీ, ఆయనకు ఆహార, పౌర సరఫరాల శాఖను కేటాయించారు. ఈ విషయంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు ఆయన విజ్ఞప్తి చేశారు.
మేం పరిష్కరించుకుంటాం: సీఎం డీకే శివకుమార్
రామలింగారెడ్డి నా తోటి నేత. సీనియర్ నాయకుడు. ఆయన నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వెళ్లి విస్తృతంగా పనులు చేయడం సాధ్యం కాదేమోనని ఆయన ఆందోళన చెందుతున్నట్టున్నారు. అందుకే వేరే ఏదైనా బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్నారు. మేం మాట్లా డుకొని పరిష్కరించుకుంటామని రాజీనామా అంశంపై శివకుమార్ తెలిపారు.






