21 May, 2026 | 3:16 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

మండల ప్రజలందరూ దసరా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

28-09-2025 11:02 PM

నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి

నల్లబెల్లి (విజయక్రాంతి): మండల ప్రజలందరూ దసరా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఏసీపీ నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో దసరా ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశానికి ఏర్పాటుచేసిన సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మండల ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన పండుగలలో గొప్ప పండుగ సద్దులు బతుకమ్మ పండుగ, దసరా అన్నారు. ప్రజలందరూ ఐకమత్యంతో శాంతియుత వాతావరణంలో పండుగ జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అధికారులు ఉత్సవాల సందర్భంగా ఎవరూ చట్టంగానే ఉల్లగించకూడదని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా మండల ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ, సీఐ సాయి రమణ, ఎస్‌ఐ గోవర్ధన్, వివిధ పార్టీల నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.