10 April, 2026 | 1:49 AM

అమ్మకాలు లేక వెలవెల..

10-04-2026 12:12 AM

ఎండలు మండుతున్నా మట్టి కుండల వద్ద నిశ్శబ్దత

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఎండలో బగ్గు మంటున్న, చల్లని నీటి కోసం ప్రజలు తహతహలాడుతున్న, మట్టి కుండల దగ్గర వ్యాపారాలు లేక వేలవేల కనిపిస్తున్నాయి. గతంలో వేసవి సీజన్ ప్రారంభం నుంచే మట్టి కుండల దుకాణాలు రద్దీగా ఉండేవి. ప్రస్తుతం మట్టికుండల దుకాణాలు వ్యాపారాలు లేక నిశ్శబ్దమే కనిపిస్తోంది. కొనుగోలు దారుల కోసం వ్యాపారులు ఎదురుచూస్తూ నీట్టూరు వస్తున్నారు.

పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ, కొత్తగూడెం తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లపై వరుసగా అమర్చిన కుండలు రోజుల తరబడి అలాగే మిగిలిపోతున్నాయి. ఉదయము నుంచి మండుటెండలో కుండల నువ్వు విక్రయించేందుకు కూర్చున్న వ్యాపారులకు ఆశించిన అమ్మకాలు జరగడం లేదు. రోజంతా కూర్చున్నా ఒకటే రెండు కంటే ఎక్కువ కుండలో అమ్ముడు పోవడం లేదని వ్యాపారులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొండలు సరఫరా చేసే పరిస్థితి ఉండేది కాదు.

నేడు కావలసినన్ని కుండలు ఉన్నా కొనే వాళ్ళు లేక గిరాకి రాక వ్యాపారులు విలవిలలాడుతున్నారు. కుండలు అమ్ముతేనే బ్రతుకు బండు నడిచేది, అవి అమ్ముడుపోకపోవడంతో ఎలా బతకాలని వ్యాపారులు వాపోతున్నారు. ఎంతో ఆశతో వేసవికాలంలో పెట్టుబడి పెట్టి స్టాకు తెచ్చిన అమ్మకాలు లేక, పెట్టుబడి తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకు పోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. రోజువారి ఖర్చులు కూడా వెళ్లే పరిస్థితి లేదని ఖాళీ చేతులతో ఇంటి ముఖం పట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మట్టి కుండలో నీరు శ్రేష్టం 

మట్టి కుండలో నీరు సహజంగా చల్లబడతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చడం వంటి లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలు వాటినే ఆదరించటం లేదని వ్యాపారులు అంటున్నారు. సమాజంలో ఫ్రిడ్జ్ ల వాడకం, ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం పెరగడంతో సాంప్రదాయ మైన  కుడలకు ఆదరణ కరువైంది . పర్యావరణానికి మేలు చేసే ఈ వృత్తి క్రమంగా కనుమరుగైతుందేమోనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సహజ వనరులను ఉపయోగించే లా ప్రజలు మట్టకుండల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారాలు లేక చిరు వ్యాపారాలు బ్రతుకు  బండి నడవక దినదినం కష్టాల్లో కూరుకు పోతున్నారు.