డ్రగ్స్ తయారీ రాకెట్ గుట్టు రట్టు
షాద్‌నగర్‌లో నిందితుల అరెస్టు
షాద్‌నగర్, మార్చి 9 (విజయక్రాం తి): షాద్‌నగర్‌లో మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ గ్యాంగ్ గుట్టును ఈగిల్ ఫోర్స్ రట్టు చేసింది. మెఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 2 బ్రోమో-4 మెథైల్ ప్రోపియోఫీనోన్ అనే రసాయనంతో పాటు, క్లోఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 3 క్లోరో-1 ఫెనైల్-1 ప్రోపనోన్ అనే కెమికల్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు తెలి పారు. ఎస్సార్ ఇన్నోవేషన్స్ డైరెక్టర్ షేక్ రఫీ కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది.
రాజస్థాన్‌కు చెందిన గ్యాంగ్ మూడు విడతల్లో దాదాపు 300 కిలోల రసాయనాలను కొనుగోలు చేసినట్లు సమాచా రం. షాద్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్నారు. రాజస్థా న్‌కు చెందిన గిరీష్ థాపర్ అలియాస్ వీరేంద్ర స్వామి నాయకత్వం వహిస్తున్నాడు. గ్యాంగులో మనీష్ బిష్ణోయి, మనోజ్ మాథూర్, శిశుపాల్, సుమీత్, రాజు కీలక పాత్ర. రాజస్థాన్ పోలీసులు వీరేంద్ర స్వామి, మనీష్ బిష్ణోయిని అదుపులోకి తీసుకున్నారు.




