25 June, 2026 | 10:22 PM

చోర్‌పల్లిలో ఇంటింటి ఓటర్ల సర్వే ప్రారంభం

25-06-2026 04:24 PM

లింగాపూర్, జూన్ 25 (విజయక్రాంతి) : లింగాపూర్ మండలం చోర్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.బీఎల్ఏలు, బీఎల్ఓలు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ పనులు చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ మార్సకోలా అనసూయ జూగాదిరావు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు.

18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.మరణించిన వారి పేర్ల తొలగింపు, రెండు చోట్ల ఓటు ఉన్నవారి వివరాల సవరణ, వలస వెళ్లిన వారి వివరాలను పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మార్సకోలా అనసూయ జూగాదిరావు, గ్రామ కార్యదర్శి వీరబాబు, సోయం విజయలక్ష్మి, బీఎల్ఏలు, బీఎల్ఓలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.