8 July, 2026 | 8:33 PM

Breaking News

పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •  

ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం

08-07-2026 07:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): సమగ్ర శిక్ష నిర్మల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కోసం మూడు రోజుల "Integrated Training Programme for In-Service Teachers" శిక్షణ బుధవారం ప్రారంభం అయ్యింది. రీజోనెన్స్ జూనియర్ కాలేజ్ విజయనగర్  జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ దర్శనం భోజన్న  ప్రారంభించారు దీనిలో భాగంగా రిజొనెన్స్ జూనియర్ కాలేజీలో ఆంగ్ల ఉపాధ్యాయులకు విజయ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు నారాయణ హై స్కూల్ లో హిందీ ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో AMO నర్సయ్య స్థానిక నిర్మల్ MEO. పద్మ. మేడం సెంటర్ ఇన్చార్జిలు మహేందర్ వెంకటరమణారెడ్డి విజయ్ కుమార్ రిసోర్స్ పర్సన్ గా 1.రామ్మోహన్ 2.రాజశేఖర్ రెడ్డి 3.పరిహారనాథ్ 4.నవీన్ గౌడ్ 5.వనిత 6.కిషన్ 7.అజీమ్ 8.జోష్ణ 9.సుశిరాజ్ 10.జైపాల్ 11.దిరాజ్ 12.వెంకటేశ్వర్ పాల్గొన్నారు.

ఘనంగా ప్రారంభమైంది. "Quality Learning Through Transformative Classroom Practices" అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ శిక్షణలో జిల్లాలోని వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనరుల వ్యక్తులు (రిసోర్స్ పర్సన్స్) తరగతి గది బోధనను మరింత ప్రభావవంతంగా మార్చేందుకు ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, విద్యార్థి కేంద్రిత అభ్యాస విధానాలు, డిజిటల్ టూల్స్ వినియోగం, ప్రెజెంటేషన్ నైపుణ్యాలు, నాణ్యమైన అభ్యాస ఫలితాల సాధనకు అవసరమైన అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరిచే వినూత్న బోధనా విధానాలను నేర్చుకుని, వాటిని పాఠశాలల్లో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.