calender_icon.png 15 February, 2026 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా శివరాత్రి ఉత్సవాలకు విరాళం

15-02-2026 12:00:00 AM

ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.21వేలు అందజేత

వరంగల్, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): మహా శివరాత్రి ఉత్సవాలకు ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 21 వేల రూపాయలు విరాళాన్ని పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్వాహకులకు అందజేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో లక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో ‘మహా శివరాత్రి’ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా స్థానిక ఉత్సవ కమిటీ వినతి మేరకు ‘ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 21 వేల రూపాయలు విరాళాన్ని ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా నేత పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. కార్యక్ర మంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, స్థానిక సర్పంచ్ బరిగేలా బాబు, మాజీ సర్పంచ్ గజావెల్లి ప్రసాద్, ఉప సర్పంచ్ బక్క ఎల్లయ్య, మండల పార్టీ నాయకులు కుక్కల భాస్కర్, సంకినేని ఎల్లస్వామి, కోలా సంపత్, సొమెందర్, గజావెల్లి రాజు, గజావెల్లి ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.