రాష్ట్రస్థాయిలో ర్యాంకుల ప్రభంజనం
ముకరంపుర,(విజయక్రాంతి): ఎస్ఆర్ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కరీంనగర్, కాకతీయ గవర్నమెంట్ కళాశాల, హనుమకొండ, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉచిత ఆన్‌లైన్ పీజీ ఎంట్రెన్స్ కోచింగ్–2026 ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఎం.కాం. ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారు.
తోట రాహుల్ ఎం కామ్ ఎంట్రన్స్ పరీక్షలో స్టేట్
1 వ ర్యాంకు, నెల్సన్ ఫ్రాన్సిస్ రాఫెల్ 5వ ర్యాంక్
తలారీ ప్రభాస్ 13వ, ర్యాంక్
నౌషిన్ బీ 16 వ, ర్యాంక్
గుడెపు రిషిత 16వ ర్యాంకు,
కొండారెడ్డి శ్రీవాణి 21వ ర్యాంకు సాధించారు అని ఉచిత ఆన్లైన్ కోచింగ్ కన్వీనర్ డా. బూర్ల నరేష్ తెలిపారు.ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రొఫెసర్ కె. రామకృష్ణ, ప్రిన్సిపాల్, ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కరీంనగర్, అధ్యాపక బృందం అభినందించారు.






